- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో డబ్బుల పంపిణీ.. ఉదయం నుంచే ప్రలోభాలు స్టార్ట్
తెలంగాణలో నిన్న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ర

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిన్న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ సందర్భంగా.. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకుని డబ్బుల పంపిణీ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచే ఇంటింటికీ పోయి చేతిలో డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీల ద్వారా ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించిన నాయకులు.. కొందరికి ఫోన్‌చేసి ఫలానా వారు వస్తారని చెబుతున్నారు. ఒక్క ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 ఇచ్చి వెళ్తున్నారని కొందరు ఓటర్లు వెల్లడించారు. పగలయితే డబ్బులు ఇస్తున్నారని తెలిసిపోతుందనే, తెల్లవారుజామున ఓటర్లకు మనీ ఇవ్వడానికి వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో డబ్బు అందని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి ఇవ్వట్లేదని నాయకులపై మండిపడుతున్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరుగుతున్నట్టు సమాచారం.ః






