ఆ సీఎంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్

by Yella Dhawani Reddy |

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఆ సీఎంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ (ఫిబ్రవరి 18) కుటుంబ సమేతంగా యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాను సందర్శించారు. ఈ సందర్భంగా పుణ్యస్నానం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మన నాయకులకు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయటం చాలా సులువు అయిపోయిందని మండిపడ్డారు. ఇవి కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతిస్తాయని వారు తెలుసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఈ వేడుక జరుగుతుందని, లక్షలాది ప్రజలు ఓ చోటుకు చేరినప్పుడు కఠిన సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. ఇలాంటి విచారకర ఘటనలు జరగాలని ఎవరు కోరుకోమని పవన్ అన్నారు.

కాగా, ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఇటీవలి జరిగిన తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ.. మహా కుంభ్‌ను 'మృత్యు కుంభ్' అని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యనించారు. ఈ కుంభమేళాలో వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, పేదలు దానికి సౌకర్యాలు కరువయ్యాయన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని యోగి ప్రభుత్వంపై మండిపడ్డారు. తొక్కిసలాట సంఘటనలో మృతదేహాలను పోస్ట్ మార్టం చేయకుండానే బెంగాల్‌కు తరలించారని, వారికి పరిహారం ఎవరు ఇవ్వాలని ప్రశ్నించారు.

Next Story