- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karnataka Elections 2023: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
వచ్చే నెల (మే) 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇవాళ విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెల (మే) 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే 166 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆ పార్టీ తాజాగా 43 మందితో కూడిన మూడో జాబితాను రిలీజ్ చేసింది. ఇక తాజాగా ప్రకటించిన జాబితాలో టికెట్ రాకపోవడంతో బీజేపీని వీడి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడికి కాంగ్రెస్ అథానీ నియోజకవర్గాన్ని కేటాయించింది. ఇక రెండో నియోజకవర్గంగా కొలార్ నుంచి పోటీ చేయాలని భావించిన మాజీ సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది.
కొలార్ స్థానాన్ని కొత్తూరు జీ మంజునాథకు కేటాయించింది. సిద్ధరామయ్యకు మొదటి జాబితాలోనే వరుణ స్థానాన్ని కేటాయించింది పార్టీ అధిష్టానం. మూడో జాబితాలో మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా కుమారుడైన నివేదిత్ ఆల్వాకు కుమ్టా స్థానాన్ని ఆ పార్టీ కేటాయించింది. ఇక మొత్తం 224 సభ్యులు గల కర్ణాటక అసెంబ్లీకి ఇప్పటికే 209 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ ఇంకా 15 స్థానాలకు అభ్యర్థులను కేటాయించలేదు. త్వరలోనే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపి చేస్తామని ఆ పార్టీ ముఖ్య నాయకుడొకరు చెప్పారు.






