Chandrababu Naidu arrest: నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన నందమూరి ఫ్యామిలీ

by Chukka Sudharani |   (  Updated:2023-10-06 08:16:34  IST  )

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌.. ఆ తరువాత జరిగిన పరిణామాలకు ప్రస్తుతం రెండు రాష్ట్రాలను పరిశీలిస్తే ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతున్నారు.

Chandrababu Naidu arrest:  నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన నందమూరి ఫ్యామిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌.. ఆ తరువాత జరిగిన పరిణామాలకు ప్రస్తుతం రెండు రాష్ట్రాలను పరిశీలిస్తే ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ సైతం నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే స్టార్ హీరోలు స్వయంగా చంద్రబాబు బాబుకు అల్లుళ్లు అయిన యంగ్ టైగర్ NTR, కళ్యాణ్ రామ్‌లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అసలేం జరగనట్టుగా ఈ ఇద్దరు హీరోలు వ్యవహరించడంతో.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ అవుతుంది. స్కిల్ డేవలప్మెంట్ స్కీం లో స్కాం జరిగిందంటూ CID చంద్రబాబును అరెస్ట్ చేయడంతో.. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనకు డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో కామెంట్స్ చేస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు.

కానీ TDP తో, చంద్రబాబుతో సంబంధం ఉన్న NTR, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ అరెస్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అంతేకాదు ఈ స్టార్ అన్నదమ్ములు ఇద్దరు ఏం జరగలేదన్నట్టు తమ సినిమా షూటింగులను కంటిన్యూ చేస్తున్నారు. దీంతో తెలుగు ప్రజలు వీరి విషయం మీద కాస్త బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఓ పక్క వీరిద్దరి బాబాయ్ నందమూరి బాలకృష్ణ అన్ని తానై చంద్రబాబుని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కనీసం బయటికి వచ్చి ఈ విషయం మీద స్పందించలేర అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు వాళ్ల మధ్య ఏం జరిగి ఉంటుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

More News : ఒకేసారి సెంట్రల్ జైలుకు Pawan Kalyan, Nara Lokesh, BalaKrishna.. ఏపీ పాలిటిక్స్‌లో రేపు కీలక పరిణామం..!

Next Story
null