- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల వేళ షాకింగ్ ఘటన.. చిక్కుల్లో బీజేపీ అభ్యర్థి.. అత్యంత అశ్లీలంగా వీడియోలు
ఎన్నికల వేళ షాకింగ్ ఘటన.. చిక్కుల్లో బీజేపీ అభ్యర్థి.. అత్యంత అశ్లీలంగా వీడియోలు

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. అభ్యర్థులంతా ఒకరిని మించి మరొకరు హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చిత్తు చేసేందుకు ట్రై చేస్తున్నారు. వినూత్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పింటు న్యూడ్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. గత సెక్స్ టార్షన్ కేసుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను అస్త్రంగా వాడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇలాంటి వాళ్లకు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించుకోవాలని జనాలకు సూచిస్తున్నాయి.
సునీల్ కుమార్ ముందుగా జేడీయూ నుంచి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. సీతామఢీ ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే 2024లో జేడీయూ నుంచి బీజేపీలో చేరాడు. ప్రస్తుతం సీతామఢీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో 2023లో ఓ మహిళతో పింటు ప్రైవేట్ వీడియో కాల్‌కు సంబంధించిన అంశాన్ని తెరపైకి తెచ్చాయి ప్రతిపక్ష పార్టీలు. అప్పుడే ఆ వీడియోను చూపించి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. పాట్నాలోని శాస్త్రి నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు పింటు. కాగా ఈ సెక్స్‌టార్షన్ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ.. పరువు తీస్తున్నారు కొందరు. ఈ వీడియోను ప్రతిపక్షాలు తమ ప్రచారంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తుండగా.. సునీల్ కుమార్ పింటు ఇది ప్రత్యర్థుల పన్నాగమని, డీప్ ఫేక్ అని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.






