అవినీతికి చిరునామాగా అరవింద్ కేజ్రీవాల్ మారిపోయారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

by Yella Dhawani Reddy |

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామ తర్వాత భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది.

అవినీతికి చిరునామాగా అరవింద్ కేజ్రీవాల్ మారిపోయారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi assembly elections) 27 ఏళ్ల సుదీర్ఘ విరామ తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 సీట్లను గెలుచుకుంది. ఇక ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 22 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ (Congress) ఖాతా కూడా తెరవలేదు. దీంతో దేశవ్యాప్తంగా కమలనాథులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీ విజయంపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy).. ఆప్, కాంగ్రెస్ పార్టీలపై సంచలన కామెంట్స్ చేశారు.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో బీజేపీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), జేపీ నడ్డాకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 12 ఏళ్లుగా ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం వీడిందని విమర్శించారు. 27 సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని, ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఢిల్లీలో లిక్కర్ స్కా్మ్ (Liquor scam) జరిగిందని ప్రజలు నమ్మారు.. లిక్కర్ స్కామ్‌పై వారి తీర్పును వెల్లడించారని అన్నారు. ఆప్ ఓటమిలో లిక్కర్ స్కామ్‌దే ప్రధాన పాత్ర అని కిషన్ రెడ్డి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్‌.. చివరికి ఆయనే అవినీతికి చిరునామాగా మారిపోయారని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోతే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అక్కడికే పరిమితం కాలేదన్నారు.

అలాగే, కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు గుండు సున్నా వచ్చిందని, రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇది ఎన్నో ఓటమో లెక్కపెట్టాలని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు డకౌట్ అయిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగితే ప్రజలు ఓట్లు వేయరని, రాజ్యాంగం విలువలు పాటించాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story