- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరకు కాఫీపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్.. స్పందించిన కాంగ్రెస్ కీలక నేత..
by Indraja |
నేడు ప్రధాని మోడి అరకు కాఫీ గురించి ట్వీట్ చేశారు.

X
దిశ వెబ్ డెస్క్: నేడు ప్రధాని మోడి అరకు కాఫీ గురించి ట్వీట్ చేశారు. ‘నేను అరకు నుండి వచ్చే కాఫీని కూడా ఆరాధిస్తాను. 2016లో విశాఖపట్నంలో AP సీఎం నారా చంద్రబాబుతో మరియు ఇతరులతో కాఫీ తాగుతూ జరిపిన సంభాషణల సందర్భంగా తీసిన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. గొప్ప విషయం ఏమిటంటే- ఈ కాఫీ సాగు గిరిజన సాధికారతతో కూడా ముడిపడి ఉంది.’ అంటూ గతంలో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
కాగా మోడీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ కీలక నేత రఘువీరా రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పంధించారు.‘ప్రధానమంత్రి గారు మీరు మా అరకు కాఫీని ఆస్వాదించి ఆరాధించినందుకు ధన్యవాదములు.గిరిజన సాధికారత గురుంచి చెప్పే సమయంలొ నిజంగా ఆ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటే చట్టంలొ వున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు యివ్వవలసిన KBK తరహా ప్యాకేజీని తక్షణం మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను.’ అంటూ రీట్వీట్ చేశారు.
Next Story






