శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

by Shamantha N |   (  Updated:2021-06-11 11:04:06  IST  )

<p>ముంబై: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసంలో లంచ్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. కానీ, సమావేశం గురించి ఇరువురూ నోరువిప్పలేదు. దీంతో వీరి భేటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అధికారికంగా ఇది బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో తమ విజయానికి తోడ్పడ్డ నేతలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఉన్నది. కానీ, దీని వెనుకే 2024 సార్వత్రిక ఎన్నికలకు వ్యూహం రూపొందించే ప్రణాళిక దాగి [&hellip;]</p>

sharad pawar kishore
X

ముంబై: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసంలో లంచ్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. కానీ, సమావేశం గురించి ఇరువురూ నోరువిప్పలేదు. దీంతో వీరి భేటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అధికారికంగా ఇది బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో తమ విజయానికి తోడ్పడ్డ నేతలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఉన్నది. కానీ, దీని వెనుకే 2024 సార్వత్రిక ఎన్నికలకు వ్యూహం రూపొందించే ప్రణాళిక దాగి ఉన్నదని రాజకీయశ్రేణులు విశ్లేషిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మోడీతో పోటిపడటానికి ప్రతిపక్షాలు సంయుక్తంగా జట్టుకట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నాయి.

Next Story