భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం

by  |
భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
నిజామాబాద్ పట్టణంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులాంగ్ చౌరస్తా సమీపంలో భారీగా గుట్కా, జర్ధా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం….నాల్గవ టౌన్ పరిధిలో పులాంగ్ చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు అక్రమంగా గుట్కా , జర్ధా ప్యాకెట్లను నిల్వవుంచినట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ షాకేర్ అలీ తన సిబ్బందితో కలిసి దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు మూడు లక్షల విలువ గల గుట్కా,జర్దా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా గుట్కాను అక్రమంగా నిల్వ వుంచినందుకు అనిల్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

24 గంటల్లో 21 లక్షల విలువైన నిషేదిత ఉత్పత్తులు స్వాధీనం నగరంలోని నాలుగవ టౌన్, రెండవ టౌన్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మూడు ఇండ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 21లక్షల విలువైన గుట్కా, తంబాకు , జర్థా, సిగరేట్‌లు, హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.

Next Story

Most Viewed