ఆ 66 మంది ఎక్కడ.. ఆరా తీస్తున్న పోలీసులు

by  |
ఆ 66 మంది ఎక్కడ.. ఆరా తీస్తున్న పోలీసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సంపాదించిన పాస్ పోర్టులతో రోహింగ్యాలు విదేశాలకు చెక్కేశారా అనే అనుమానం తలెత్తుతోంది. ఇప్పుడు నిఘా వర్గాలు కూడా ఈ వాదనలను కొట్టి పారేయ్యడం లేదు. బోధన్ కేంద్రంగా పాస్ పోర్టులు పొందిన 66 మంది రోహింగ్యాలు ఎక్కడ ఉన్నారో ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు. అయితే వారు సౌది ఆరేబియా, దుబాయ్‌తో పాటు ఇతర గల్ప్ దేశాలకు చెక్కేశారు అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే బోధన్‌లో పాస్ పోర్టులు పొందిన 6 గురు ఈ నెల 4న శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా విదేశాలకు వేళ్లేందుకు యత్నించగా ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలో పట్టుబడిన విషయం తెలిసిందే. వారిని విచారించగా.. ఎస్బీలో పనిచేసిన ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐలతో పాటు ఇద్దరు మీ సేవ నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో 72 మంది వరకు రోహింగ్యాలకు పాస్ పోర్టులను ఇద్ధరు ఎస్‌బీ పోలిసులు ఇప్పించినట్లు తెలిసింది. పాస్ పోర్టులు తీసుకున్న వారు విడతల వారిగా విదేశాలకు జారుకున్నారని.. చివరి బ్యాచ్ వారిని పోలిసులు కూపీ లాగడంతో రోహింగ్యాలకు పాస్ పోర్టుల వ్యవహరం వెలుగు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బంగాళీలుగా పరిచయం…

బోధన్‌లోని శర్బత్ కెనాల్ ప్రాంతంలో స్పెషల్ బ్రాంచ్‌లో రెండేళ్ల క్రితం హెడ్ కానిస్టెబుల్‌గా ఉన్న మల్లెశ్వర్ ఇంటిలో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన పరిమళ్ బేన్ అనే వ్యక్తి తాను ఆయుర్వేద వైద్యుడిగా చెప్పుకుని అద్దెకు దిగాడని తెలిసింది. అతడే స్థానికంగా ప్రజలకు పైల్స్ తగ్గించే మందులు వేస్తానని చెప్పి అందరిని అక్కడికి చెర్చాడని, మధ్యవర్తిగా వ్యవహరించి ఇద్దరు మీ సేవా నిర్వహకులతో కలిసి సూమారు 72 మందికి పాస్ పోర్టులు ఇప్పించారని సమాచారం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వర్ణకార వృత్తి, చీరలకు జరీ వర్క్‌లు చేసి వృత్తి పనివారలుగా అక్కడ తిష్టవేసి పాస్ పోర్టులను పొందినట్లు తెలిసింది. వారంతా ఎస్‌బీ కానిస్టెబుల్ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు ఒక్కొక్కరు రూ.2 వేలు నెలకు అద్దె ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎస్సైగా పనిచేస్తున్న మల్లెష్ ఇంటి నెంబర్, అడ్రస్‌లు ఆధారంగా 32 మంది పాస్ పోర్టులు పొందిన విషయం తెలిసిందే. మొత్తంగా ఎస్ఐ ఇంటిలో అద్దెకు ఉన్న వారు ఎన్నడు వారు చెప్పిన కుల వృత్తులు చెయ్యలేదని స్థానికులు తెలిపారు.

జిల్లాలో అసలు రోహింగ్యాలు ఎందరు…..

నిజామాబాద్ జిల్లాలో స్వర్ణ అభరాణాల మెరుగులద్దడం, చీరలకు నగీషీలను అద్దాల అమరికతో అందంగా చేసే వందల మంది బంగాళీలు ఉన్నారు. జిల్లా నలుమూలల్లో స్వర్ణ ఆభరాణాల మెరుగులద్దకంతో పాటు చీరలకు జరీ వర్క్‌ల దుకాణాలు అన్ని వారివే. నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లి, గంజ్‌తో పాటు బోధన్‌లో, ఆర్మూర్‌తో పాటు కామారెడ్డి, బాన్సువాడ ఏరియాలలో పశ్చిమ బంగాళీల పేరుతో చాలామంది ఉన్నారు. చాలాసార్లు ఇక్కడ స్వర్ణ అభరణాల దుకాణాదారులను మోసం చేసి పరారైన ఘటనలూ ఉన్నాయి. అసలు పశ్చిమ బంగాళీలుగా జిల్లాలో తిష్ట వేసిన వందలాది మందిలో భారతీయలు ఎందరు.. వారి పేరుతో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు అనేది గుర్తించడం ఇప్పుడు నిఘా వర్గాలకు తలకు మించిన భారంగా మారింది. చాలా మంది బంగాళీలుగా ఇక్కడ తిష్టవేసి అన్ని రకాల ప్రభుత్వ గుర్తింపు పత్రాలను పొందారు. దీంతో వారిలో రోహింగ్యాలు ఎందరు అని గుర్తించడం కష్ట తరమైన పని. దీంతో అసలు బెంగాళీలా లేక వారు మయన్మార్ నుంచి వచ్చారా అనే వివరాలను ఆరా తీసేందుకు నిఘా వర్గాలతో పాటు స్థానికుల సహయం కోరుతున్నారు.


Next Story

Most Viewed