షర్మిల సభకు అడుగడుగునా ఆంక్షలు..!

by Sridhar Babu |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9వ తేదీన షర్మిల నిర్వహిస్తున్న సభకు అనుమతులిచ్చిన పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. శానిటైజర్లు, మాస్క్‌లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. షర్మిల లక్షమందికిపైగా జనంతో భారీ బహిరంగ సభకు ప్రణాళికలు చేసినా కేవలం 5 నుంచి 6 వేల మందితోనే సభ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. పెవిలియన్ గ్రౌండ్‌లో [&hellip;]</p>

షర్మిల సభకు అడుగడుగునా ఆంక్షలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9వ తేదీన షర్మిల నిర్వహిస్తున్న సభకు అనుమతులిచ్చిన పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. శానిటైజర్లు, మాస్క్‌లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

షర్మిల లక్షమందికిపైగా జనంతో భారీ బహిరంగ సభకు ప్రణాళికలు చేసినా కేవలం 5 నుంచి 6 వేల మందితోనే సభ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. పెవిలియన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఈ సభకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతులిచ్చారు.

Next Story