- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసును దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు
by Shyam |
<p>దిశ, మెదక్ విధుల్లో ఉన్న పోలీసుపై దురుసుగా ప్రవర్తించి , దుర్భాషలాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం రేగోడ్ మండలానికి చెందిన మహిళను ఆమె భర్త తీవ్రంగా వేధిస్తుండటంతో స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె తన పుట్టింటింకి వెళ్లిపోయింది. దీంతో అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్యను ఇంటికి రప్పించాలని లేకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా […]</p>
దిశ, మెదక్
విధుల్లో ఉన్న పోలీసుపై దురుసుగా ప్రవర్తించి , దుర్భాషలాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం రేగోడ్ మండలానికి చెందిన మహిళను ఆమె భర్త తీవ్రంగా వేధిస్తుండటంతో స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె తన పుట్టింటింకి వెళ్లిపోయింది. దీంతో అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్యను ఇంటికి రప్పించాలని లేకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడుతూ దాడి చేశాడు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని జోగిపేట మున్సిపల్ కోర్ట్ లో హాజరుపరుచగా, రిమాండ్‌కు పంపాలని మెజిస్ట్రేట్ ఆదేశించినట్టు ఎస్సై తెలిపారు.
Tags: Medak, police,case file, remand, Telangana
Next Story






