- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. మొక్కజొన్న పంటలో గంజాయి సాగు.. పోలీసుల దాడులు
by Shyam |
<p>దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ధన్‌సింగ్ తండాలో అక్రమంగా సాగుచేస్తున్న గంజాయి పంటపై ఆదివారం అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. తండాకు చెందిన రతన్ సింగ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, కంది చేనులో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న ప్రొహిబిషన్ అబ్కారీ, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రతన్ సింగ్ సాగు భూమిలో 267 గంజాయి మొక్కలను ధ్వంసం […]</p>

X
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ధన్‌సింగ్ తండాలో అక్రమంగా సాగుచేస్తున్న గంజాయి పంటపై ఆదివారం అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. తండాకు చెందిన రతన్ సింగ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, కంది చేనులో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న ప్రొహిబిషన్ అబ్కారీ, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు.
ఈ సందర్భంగా రతన్ సింగ్ సాగు భూమిలో 267 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గతంలో గాంధారి మండల కేంద్రంలో సారా విక్రయాలపై దాడులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ సీఐ సాయన్న, ఎస్‌ఐ శివకృష్ణ, కానిస్టేబుల్‌లు సంగయ్య, రవి, అమృతరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్, సరిత, లావణ్య పాల్గొన్నారు.

Next Story






