లాడ్జీల్లో పోలీసుల సోదాలు

by  |
SHO-LODGE1
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పలు లాడ్జీల్లో పోలీసులు సోదాలు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా దాడులు నిర్వహించామని ఎస్ హెచ్వో సైదేశ్వర్ తెలిపారు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో తమ పరిధిలోని లాడ్జీల్లో పరిస్థితి అంతా సవ్యంగానే ఉందని ఆయన చెప్పారు. తనిఖీ సందర్భంగా లాడ్జీల్లో అనుమానిత వ్యక్తులు తారసపడలేదని ఆయన తెలిపారు. అనుమానాస్పద పరిస్థితులు, వ్యక్తుల సమాచారాన్ని నిర్వాహకులు, ప్రజలు తమకు చేరవేస్తే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలాను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed