కోడిపందాలపై ఖాకీ నిఘా

50

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కోడిపందాలను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు. పలుచోట్ల కోడిపందాల బరులను ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో పందాలకు ఉపయోగించే కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు.