యంగ్ కపుల్‌ను షూట్ చేసిన పోలీస్.. వీడియో వైరల్

by  |
Police Officer Shot A Young Couple
X

దిశ, సినిమా : ఓ షాపింగ్ మాల్ ముందర యంగ్ కపుల్‌ను షూట్ చేసిన పోలీస్ ఆఫీసర్ వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో మిట్ట మధ్యాహ్నం ఇలాంటి దారుణాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ కామెంట్స్‌పై స్పందించి విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శ్రీవాత్సవ్ నిజానిజాలను బయటపెట్టారు. సోషల్ మీడియాలో వైడ్‌గా సర్క్యులేట్ అయిన ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. ఇది హర్యానా కర్నల్‌లోని ‘ఫ్రెండ్స్ కేఫ్’ దగ్గర ఓ వెబ్ సిరీస్ కోసం జరిగిన షూటింగ్ వీడియో అని తెలిపారు. తెలిసీ తెలియకుండా ఇష్టారీతిన క్యాప్షన్స్ యాడ్ చేస్తూ ఇలాంటి వీడియోలు స్ప్రెడ్ చేసి సామాన్యులను భయాందోళనకు గురిచేయకూడదని సూచించారు.



Next Story

Most Viewed