పోలీసుల నోటీసులు.. రేవంత్ రెడ్డి పర్యటన రద్దు

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన రద్దు అయ్యింది. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో స్థానిక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి బుధవారం రేవంత్ రెడ్డిని నిర్మల్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటన కూడా దాదాపుగా ఖరారైంది. నిర్మల్ తో పాటు సారంగాపూర్, దిలావర్ పూర్ మండలాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కొవిడ్-19 సమయంలో రేవంత్ రెడ్డి పర్యటన [&hellip;]</p>

పోలీసుల నోటీసులు.. రేవంత్ రెడ్డి పర్యటన రద్దు
X

దిశ, ఆదిలాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన రద్దు అయ్యింది. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో స్థానిక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి బుధవారం రేవంత్ రెడ్డిని నిర్మల్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటన కూడా దాదాపుగా ఖరారైంది. నిర్మల్ తో పాటు సారంగాపూర్, దిలావర్ పూర్ మండలాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కొవిడ్-19 సమయంలో రేవంత్ రెడ్డి పర్యటన నిషేధం అని, రైతులతో సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఇక్కడి పోలీసులు మహేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. హైదరాబాదులోనూ రేవంత్ రెడ్డికి పోలీసులు ఇచ్చిన నోటీసుల కారణంగానే ఆయన పర్యటన రద్దు అయిందని సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

రేవంత్ అంటే భయం ఎందుకు..?

ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిర్మల్ వస్తున్నారంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వణుకు ఎందుకు అని ప్రశ్నించారు. రైతుల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి నిర్మల్ వస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం దురుద్దేశంతోనే ఆయన పర్యటనను రద్దు చేయించిందని ఆరోపించారు. తమ అక్రమాలు బయటపడతాయనే భయపడి రేవంత్ ను రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమన్నారు.

Next Story