- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణపట్నం ఆనందయ్యను రహస్య ప్రాంతానికి పోలీసులు తరలించారు. భారీ పోలీస్ బందోబస్త్‌తో ఆయనను గుట్టుచప్పుడు కాకుండా ఇవాళ ఉదయం తరలించారు. ఇలా తరలించడానికి కారణం ఏంటనేది తెలియడం లేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలారోజుల తర్వాత శుక్రవారం ఆనందయ్య ఇంటికి చేరుకోగా.. పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే సమాచారంతో గ్రామస్తులు భారీగా చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత గ్రామస్తులు వెళ్లిపోవడంతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణపట్నం ఆనందయ్యను రహస్య ప్రాంతానికి పోలీసులు తరలించారు. భారీ పోలీస్ బందోబస్త్‌తో ఆయనను గుట్టుచప్పుడు కాకుండా ఇవాళ ఉదయం తరలించారు. ఇలా తరలించడానికి కారణం ఏంటనేది తెలియడం లేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలారోజుల తర్వాత శుక్రవారం ఆనందయ్య ఇంటికి చేరుకోగా.. పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే సమాచారంతో గ్రామస్తులు భారీగా చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ తర్వాత గ్రామస్తులు వెళ్లిపోవడంతో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. ఆనందయ్యను ఎక్కడికి తరలించవద్దని, ఇక్కడే ఉంచాలని గ్రామస్తులు కోరారు. ఈ క్రమంలో ఇవాళ ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించడం కలకలం రేపుతోంది. నేడు ఆనందయ్య మందుకు సంబంధించి ఆయుష్ శాఖ తుది నివేదిక రానున్న క్రమంలో.. ఇది చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.






