ఇత్తడి వస్తువుల మాయంపై దర్యాప్తు

by  |
ఇత్తడి వస్తువుల మాయంపై దర్యాప్తు
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ సింహాచలం అప్పన్నస్వామి ఆలయ కల్యాణ మండపంలో భద్రపరిచిన ఇత్తడి వస్తువులు మాయమైన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వస్తువులు ఎక్కడ ఉంచారు, ఎలాంటి భద్రత కల్పించారనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఇవి చోరీకి గురయ్యాయా లేక వ్యాపారి తీసుకెళ్లారా అని అనుమానిస్తున్నట్లు క్రైం డీసీపీ సురేష్​ తెలిపారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు. భక్తులు మొక్కుబడిగా హుండీలో కడియాలు, ఇత్తడితో చేసిన కోడెదూడ బొమ్మలను వేస్తుంటారు. వాటిని ఇటీవల వేలం వేశారు. వేలం దక్కించుకున్న వ్యాపారి కొంత తరుగు ఇవ్వాలని ఆలయ అధికారులను కోరారు. కొద్దిరోజులుగా వాటిని మూటలుకట్టి స్థానిక కల్యాణ మండపంలో ఉంచారు. సుమారు 50బస్తాలను భద్రపరచగా 40బస్తాలకు పైగా మాయమైనట్లు సమాచారం. ఇవి చోరీకి గురయ్యాయా లేక వ్యాపారి తీసుకెళ్లారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed