దసరాకు ఊరెళ్తున్నారా..? పోలీసులు అలర్ట్..

by  |
దసరాకు ఊరెళ్తున్నారా..? పోలీసులు అలర్ట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. ఆ పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇంటికి తాళం వేసినట్లు కనిపిస్తే దొంగలు చేతి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇంటిని గుళ్లా చేస్తుంటారు. ఈ తరుణంలో మాకు సమాచారం ఇవ్వండి…మీ ఇంటికి రక్షణ మా రక్షణ అని పోలీసులు హామీ ఇస్తున్నారు.

ఉద్యోగ, ఉపాధి కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ కు వచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి కావడంతో స్వగ్రామంలో ఇంటిల్లిపాది జరుపుకోవాలని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు. అందరూ స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఈ తరుణంలో ఇదే అదునుగా భావించిన దొంగలు ఇళ్లను గుళ్లా చేస్తుంటారు. అయితే ఆ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఊరెళ్తారో సమీపంలోని పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. మీ ఇంటిని మా స్వంత ఇంటిలా కాపాడుతామని రక్షణ కల్పిస్తామని ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్ర అడిషనల్ కమిషర్ ఆఫ్ పోలీస్ షిఖా గోయల్ మంగళవారం ఉత్తర్వులు సైతం జారీ చేశారు.



Next Story