- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో బీభత్సం.. రిమాండ్‌కు తరలించిన పోలీసులు
<p>దిశ, శేరిలింగంపల్లి: మద్యం సేవించి అతివేగంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారకుడైన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 6వ తేదీన రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేట్ గూం చాహిల్స్ విల్లాస్ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు శంకర్‌పల్లి-హైదరాబాద్ రహదారిపై ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తోన్న కోకాపేట్‌కు చెందిన దుర్గం రాజు(37), అతని భార్య మౌనిక (28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం […]</p>

దిశ, శేరిలింగంపల్లి: మద్యం సేవించి అతివేగంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారకుడైన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 6వ తేదీన రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేట్ గూం చాహిల్స్ విల్లాస్ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు శంకర్‌పల్లి-హైదరాబాద్ రహదారిపై ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తోన్న కోకాపేట్‌కు చెందిన దుర్గం రాజు(37), అతని భార్య మౌనిక (28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సంజీవను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి బీఏసీ పరీక్ష నిర్వహించగా ఆల్కహాల్ రీడింగ్ 148గా వచ్చిందని తెలిపారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమయ్యాడని తేల్చారు. నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






