- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్‌మార్కెట్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు.. రెండు ముఠాలు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ముఠాలను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు సంబంధించిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, వారినుంచి 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. ఇక్కో ఇంజెక్షన్‌ను రూ. 35 వేల నుంచి రూ. 50 వేల చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ ముఠాలు నగరంలోని ఎస్‌ఆర్‌నగర్, బంజారాహిల్స్‌లలో ఇంజెక్షన్లను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ముఠాలను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు సంబంధించిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, వారినుంచి 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. ఇక్కో ఇంజెక్షన్‌ను రూ. 35 వేల నుంచి రూ. 50 వేల చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ ముఠాలు నగరంలోని ఎస్‌ఆర్‌నగర్, బంజారాహిల్స్‌లలో ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని.. ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






