ఆ తోటలో గంజాయి మొక్కలు.. ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ

by  |

దిశ, నారాయణఖేడ్: మనూరు మండలం బాదల్గావ్ గ్రామంలో చెరుకు పంట లో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నారాన్న రహస్య సమాచారం మేరకు గురువారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పది లక్షల విలువగల 150 గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నారాయణఖేడ్ ఎక్సైజ్ సిఐ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ రవి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 10 లక్షల విలువ చేసే 150 మొక్కలను దహనం చేశామని వివరించారు. ఎవరైనా రైతులు తమ పంట చేల లో అక్రమంగా గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story

Most Viewed