కర్రీ ఉడకలేదని.. బార్ ఓనర్‌ని కొట్టిన కానిస్టేబుళ్ళు

by Shyam |

<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్‌లో పోలీస్ కానిస్టేబుళ్లు హల్‌చల్ చేశారు. కర్రీ సరిగా ఉడక లేదని మద్యం మత్తులో బార్ నిర్వాహకున్ని చితకబాదారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ‘వీరభద్ర బార్‌ అండ్‌ రెస్టారెంట్’లోకి వివిధ ప్రాంతాల నుంచి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు. అనంతరం మద్యం సేవించడం ప్రారంభించారు. వీరిలో ములుగు జిల్లాలో పనిచేసే కానిస్టేబుల్, యాదాద్రి జిల్లాలో పనిచేసే మరో కానిస్టేబుల్ మద్యం మత్తులో [&hellip;]</p>

Police constables
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్‌లో పోలీస్ కానిస్టేబుళ్లు హల్‌చల్ చేశారు. కర్రీ సరిగా ఉడక లేదని మద్యం మత్తులో బార్ నిర్వాహకున్ని చితకబాదారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ‘వీరభద్ర బార్‌ అండ్‌ రెస్టారెంట్’లోకి వివిధ ప్రాంతాల నుంచి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు. అనంతరం మద్యం సేవించడం ప్రారంభించారు. వీరిలో ములుగు జిల్లాలో పనిచేసే కానిస్టేబుల్, యాదాద్రి జిల్లాలో పనిచేసే మరో కానిస్టేబుల్ మద్యం మత్తులో స్టఫ్‌లో వాడిన కర్రీ సరిగా ఉడకలేదని నిర్వాహకుడు శ్రీనివాస్‌తో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ దాడిలో శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story