అక్కడ పెద్దఎత్తున పోలీసుల పహారా.. ఎందుకు?

by  |
అక్కడ పెద్దఎత్తున పోలీసుల పహారా.. ఎందుకు?
X

దిశ, కాటారం: మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం నుండి వారం రోజుల పాటు జరగనున్న ఈ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టుల కదలికలను కట్టి చేసేందుకు ఓ వైపున గాలింపు చర్యలు చేపడుతూనే మరో వైపున తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు తీవ్రంగా ఉండడంతో బార్డర్ ఏరియాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాళేశ్వరం వంతెన మీదుగా రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత అనుమతిస్తున్నారు. అలాగే పల్మెల మండలంలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ ప్రాంతానికి అవల ఉన్న చత్తీస్ ఘఢ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తిరుగులేని పట్టు సాధించుకుని ఉన్న నేపథ్యంలో భద్రకాళి గుట్ట మీదుగా రాష్ట్రంలోకి మావోలు ప్రవేశించే అవకావాలు ఉంటాయని భావించిన పోలీసులు ఆ ప్రాంతంలో కూడా గస్తీ ముమ్మరం చేశారు. వారోత్సవాల్ సందర్భంగా మావోయిస్టుల చర్యలను నిలువరించాలన్న లక్ష్యంతో పోలీసులు పకడ్భందీగా బందోబస్తు చేపట్టారు.



Next Story