బాగా సెటిలైన అబ్బాయిలపైనే ఆమె గురి!

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌‌డెస్క్: ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో బాగా సెటిల్ అయిన అబ్బాయిత కోసం సెర్చ్ చేయడం. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం. ఆ తర్వాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం..ఆమెకు పరిపాటిగా మారింది. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుంది. అయితే, ఇటీవల ఆమె ఘనకార్యంపై మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతికి చెందిన యువతి [&hellip;]</p>

బాగా సెటిలైన అబ్బాయిలపైనే ఆమె గురి!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో బాగా సెటిల్ అయిన అబ్బాయిత కోసం సెర్చ్ చేయడం. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం. ఆ తర్వాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం..ఆమెకు పరిపాటిగా మారింది. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుంది. అయితే, ఇటీవల ఆమె ఘనకార్యంపై మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న, అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న. ఇలా పేర్లు మార్చి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్ సెట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి ఆర్థికంగా ఉన్నవారికి నమ్మించి బుట్టలో పడేస్తుంది. ఈ విషయం ప్రకాశం జిల్లాలోని దొనకొండలో వెలుగుచూసింది.

పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి తర్వాత వేరుగా ఉంటానని, సెటిల్‌మెంట్‌ చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే గతేడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. 3నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం ఉన్నారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేశాడు. అయితే ఆమె తనతో వెళ్లేందుకు నిరాకరించింది. పాస్‌పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని కొన్ని పనులు ఉన్నాయని చెప్పింది. దీంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ, స్వప్న తీరుపై అనుమానం వచ్చిన అతను అసలు విషయం ఎంటనే కోణంలో కూపీ లాగాడు.

దాంతో స్పప్న లీలలు వెలుగు చూశాయి. రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తేలింది. చిత్తూరుకు చెందిన పృధ్వీరాజ్, ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే మరో ఇద్దరితో ఆమెకు గతంలో వివాహమైనట్లు రామాంజనేయులు గుర్తించాడు. పృధ్వీపై తిరుపతి మహిళా పీఎస్‌లో స్వప్న కేసు కూడా పెట్టినట్లు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.6 లక్షలు వసూలు చేసిన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. దీనిపై తిరుపతి సీసీఎస్ పీఎస్‌లో కేసు కూడా నమోదైంది. ఇవన్నీ తెలియడంతో మూడో భర్త స్వప్నని నిలదీశాడు. పెళ్లి చేసుకున్నావు కాబట్టి రూ.30లక్షలు ఇచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను బెదిరింపులకు లొంగకపోవడంతో దొనకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కూడా స్వప్న చీటర్ అనే విషయం బట్టబయలైంది.

Next Story