- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగలను పట్టించిన కాగితం ముక్క
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నడికుడి స్టేట్ బ్యాంక్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మిర్యాలగూడకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగలను ఓ కాగితం ముక్క పట్టించడం గమనార్హం. కాగితంలోని ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బ్యాంక్ నుంచి మొత్తం రూ. 85 లక్షలను దొంగిలించిన నిందితులు దాచేపల్లి శ్మశానంలో రూ. 45 లక్షల డబ్బును పాతి పెట్టారు. అలాగే ఓ దొంగ ఇంట్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నడికుడి స్టేట్ బ్యాంక్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మిర్యాలగూడకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగలను ఓ కాగితం ముక్క పట్టించడం గమనార్హం. కాగితంలోని ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బ్యాంక్ నుంచి మొత్తం రూ. 85 లక్షలను దొంగిలించిన నిందితులు దాచేపల్లి శ్మశానంలో రూ. 45 లక్షల డబ్బును పాతి పెట్టారు. అలాగే ఓ దొంగ ఇంట్లో రూ. 16 లక్షలు, మరో దొంగ ఇంటి ఎదురుగా ఉన్న గుట్టలో రూ. 15 లక్షలు దాచిపెట్టారు. నిందితుల ఆచూకీ తెలుసుకున్న పోలీసులు దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకొని.. వారిని అరెస్ట్ చేశారు.
Next Story






