మహిళలను స్థంభానికి కట్టేసినట్లు ఫేక్ వీడియో.. సొంత కొడుకే డ్రామా.. అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-14 10:57:14  IST  )

మహిళను స్తంభానికి కట్టేసినట్లు ఫేక్ వీడియో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు..

మహిళలను స్థంభానికి కట్టేసినట్లు ఫేక్ వీడియో..  సొంత కొడుకే డ్రామా.. అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలను కరెంట్ స్థంభానికి కట్టేసినట్లు ఫేక్ వీడియో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతిపురం మండలం తమ్మిగానిపల్లికి చెందిన సురేశ్.. తన తల్లిని కరెంట్ స్థంభానికి కట్టి డ్రామా ఆడారు. బంధువులతో ఉన్న ఆస్థి తగాదాల నేపథ్యంలో తప్పుడు ప్రచారం కోసం తల్లిని డ్రిప్ పైపులతో కట్టేసి బంధువులే చేశారని ఫేస్ బుక్‌లో వీడియో పెట్టారు. ఈ ఘటన వైరల్‌గా మారడంతో పోలీసులు దృష్టి పెట్టారు. తప్పుడు ప్రచారం కోసం డ్రామా ఆడినట్లు నిర్ధారణ కావడంతో సురేశ్‌పై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. తప్పుదారి పట్టించేలా వీడియోలు చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

నిందితుడు సృష్టించిన ఫేక్ వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి..

Next Story