కరోనా ప్రభావిత గ్రామాల్లో పోలీసుల సాయం

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: కరోనా ప్రభావిత గ్రామాల్లోని పేదలకు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు జిల్లా ప్రజలంతా సహకరించాలన్నారు. పేదల ఇబ్బందులు తీర్చడానికి, పోలీసులు ఓ వైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు సేవ చేస్తున్నారని తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. రాత్రింబగళ్లు కష్టపడి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, [&hellip;]</p>

కరోనా ప్రభావిత గ్రామాల్లో పోలీసుల సాయం
X

దిశ, ఆదిలాబాద్: కరోనా ప్రభావిత గ్రామాల్లోని పేదలకు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు జిల్లా ప్రజలంతా సహకరించాలన్నారు. పేదల ఇబ్బందులు తీర్చడానికి, పోలీసులు ఓ వైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు సేవ చేస్తున్నారని తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. రాత్రింబగళ్లు కష్టపడి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, కరోనా వ్యాప్తిని నిలువరించగలిగామని చెప్పుకొచ్చారు. అలాగే, వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Tags: Police, distributing, essential, goods, poor people, adilabad, sp

Next Story