ప్రధాని మోడీ సీరియస్.. అనవసర రాద్ధాంతం ఆపండి..!

by  |
ప్రధాని మోడీ సీరియస్.. అనవసర రాద్ధాంతం ఆపండి..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 11వ రోజు. నాటి నుంచి ఉభయసభల్లోనూ ప్రతిపక్ష పార్టీ ఎంపీలు సమావేశాలు జరగనివ్వకుండా గందరగోళం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు పెగాసస్, పెట్రోల్ ధరల అంశంపై సభ ప్రారంభం నుంచే ఉభయసభల్లో ఆందోళన చేపడుతున్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీల తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వర్షాకాల సమావేశాలు జరగనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని ప్రధాని మోడీ సైతం మండిపడ్డారు.

విపక్షాల తీరు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉన్నాయని దేశప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో వైపు ఈ గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కూడా కొనసాగుతున్నాయి. పెగాసస్ అంశంపై పార్లమెంటులో చర్చ నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలాఉండగా ఈనెల 5న పెగాసస్ అంశంపై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed