- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతులు కట్టుకుని కూర్చోం: మోడీ
<p>దిశ, వెబ్ డెస్క్: శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరిహద్దు వివాదమై గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో శుక్రవారం లడాఖ్ లో ఆయన ఆకస్మికంగా పర్యటించి జవాన్లతో మాట్లాడారు. అక్కడి ప్రస్తుత పరిస్థితులపై ప్రధానికి ఆర్మీ అధికారులు వివరించారు. అనంతరం ఆయన జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. సరిహద్దుల్లో జవాన్ల వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని, భారత సైనికుల తెగువ వెలకట్టలేనిదని, మీ ధైర్య […]</p>

దిశ, వెబ్ డెస్క్: శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరిహద్దు వివాదమై గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో శుక్రవారం లడాఖ్ లో ఆయన ఆకస్మికంగా పర్యటించి జవాన్లతో మాట్లాడారు. అక్కడి ప్రస్తుత పరిస్థితులపై ప్రధానికి ఆర్మీ అధికారులు వివరించారు. అనంతరం ఆయన జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. సరిహద్దుల్లో జవాన్ల వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని, భారత సైనికుల తెగువ వెలకట్టలేనిదని, మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మరిచిపోదంటూ భద్రతా బలగాల శౌర్యానికి సెల్యూట్ అని ఆయన అన్నారు. జవాన్ల త్యాగం నిరుపమానమైనదని, అమరులైన సైనికులకు మరోసారి నివాళి అని ప్రధాని అన్నారు. ధైర్యవంతులే శాంతి కోరుకుంటారని, శాంతిపై భారత్ కు ఉన్న నిబద్ధతను ప్రపంచమంతా గమనించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ లడాఖ్ లో ఆకస్మిక పర్యటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.






