రెండో డోసు టీకా తీసుకున్న ప్రధాని

64
pm modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోడీ తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. ‘ఎయిమ్స్‌లో ఈ రోజు నేను రెండో డోసు తీసుకున్నాను. వైరస్‌ను జయించడానికి వ్యాక్సినేషన్ మనకున్న మార్గాల్లో ఒకటి. కాబట్టి, మీరు టీకా పొందడానికి అర్హులైతే, వెంటనే వ్యాక్సిన్ వేసుకోండి. కొవిన్‌లో మీ పేరు నమోదు చేసుకోండి’ అని ట్వీట్ చేశారు. మార్చి నెల 1వ తేదీన ఆయన ఎయిమ్స్‌లో కొవాగ్జిన్ టీకా తీసుకున్న సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..