ఇంటింటా బాలు పేరు మారుమోగేది : మోదీ

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-25 05:22:29  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా బాలుపేరు తెలియని ఇల్లు లేదని, ఇంటింటా ఆయన పేరు మారుమోగుతుండేదని ప్రధాని తన సంతాప సందేశంలో గుర్తు చేశారు.ఆయన గాత్ర మాధుర్యం, సంగీతం దశాబ్దాలుగా ప్రజలను ఉర్రూతలూగిస్తూనే ఉందన్నారు. ఎస్‌పీబీ లేని లోటు ఆయన కుటుంబ సభ్యులను ఎంత ఆవేదనకు గురిచేస్తుందో తలుచుకుంటే ఆవేదన కలుగుతోందని వివరించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు గుండె [&hellip;]</p>

ఇంటింటా బాలు పేరు మారుమోగేది : మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్ :

గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా బాలుపేరు తెలియని ఇల్లు లేదని, ఇంటింటా ఆయన పేరు మారుమోగుతుండేదని ప్రధాని తన సంతాప సందేశంలో గుర్తు చేశారు.ఆయన గాత్ర మాధుర్యం, సంగీతం దశాబ్దాలుగా ప్రజలను ఉర్రూతలూగిస్తూనే ఉందన్నారు.

ఎస్‌పీబీ లేని లోటు ఆయన కుటుంబ సభ్యులను ఎంత ఆవేదనకు గురిచేస్తుందో తలుచుకుంటే ఆవేదన కలుగుతోందని వివరించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు గుండె నిబ్బరం చేసుకోవాలని, బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు మోడీ పేర్కొన్నారు.

Read also…

బాలు మృతిపై కుమారుడు చరణ్ ప్రకటన

Next Story