మానవాళి రక్షణకు మేడిన్ ఇండియా టీకాలు: మోడీ

by  |
మానవాళి రక్షణకు మేడిన్ ఇండియా టీకాలు: మోడీ
X

న్యూఢిల్లీ: నిన్నా మొన్నటి వరకు వైద్య పరికరాలకు దిగుమతిపై ఆధారపడిన భారత్ ఇప్పుడు రెండు మేడిన్ ఇండియా కరోనా టీకాలతో మానవాళిని రక్షించే స్థాయికి ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్‌లతో భారత్ మానవాళిని రక్షించడానికి సంసిద్ధమైందని చెప్పారు. ప్రాణాలను రక్షించే టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూడటమే కాదు, భారత్‌లో నిర్వహించే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియనూ తిలకించడానికి ఆతృతపడుతున్నదని తెలిపారు. 16వ ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మోడీ శనివారం ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

భారత్ ప్రపంచ ఫార్మసీగా ఉన్నదని, ఇకపైనా అలాగే కొనసాగుతుందని అన్నారు. లోకంలో ఏ మూలనున్నా అవసరార్థులకు ఔషధాలను ఇండియా అందించిందని తెలిపారు. కరోనా మరణాల రేటు స్వల్పంగా, అధిక రికవరీ రేటు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఉన్నదని, కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చిన పోరాడిన తీరు అమోఘమని అన్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అవినీతికి చరమగీతం పాడటంతో భారత్ సఫలమవుతున్నదన్నారు. నేడు అవినీతికి తావులేకుండా ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు అందజేస్తున్నదని తెలిపారు.



Next Story