ఇళ్లపై కూలిన విమానం.. ఇద్దరు మృతి

by  |
aircraft-clash1
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ఇళ్ల మీద విమానం కూలి ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ట్విన్ -ఇంజిన్ సెస్నా 340 అనే విమానం కాలిఫోర్నియాలోని ఇళ్లపై కూలింది. అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరి కాలిఫోర్నియాకు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పలు ఇళ్లతోపాటు వాహనాలు దగ్ధమయ్యాయి. విమానం పూర్తిగా కాలిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.Next Story