‘ప్లాన్ బి’ టీజర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్

by  |
‘ప్లాన్ బి’ టీజర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్ బి’. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌లో కేవీ రాజమహి డైరెక్ట్ చేస్తున్న సినిమా టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమా టీజర్ క్యురియాసిటీ పెంచగా.. మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ కథ తిరుగుతుందని టీజర్‌‌ను చూస్తే తెలుస్తుండగా.. వ్యక్తిని చంపేందుకు ప్లాన్ ఏ కాకుండా ‘ప్లాన్-బి’ని అమలు చేసిన హంతకుడిని పట్టుకోవడమే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన డౌరెక్టర్ కేవీ రాజమహి.. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ఓకే చేసిన నిర్మాతకు థాంక్స్ చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, మురళిశర్మ, రవి ప్రకాశ్, అభినవ్ సర్దార్‌లు అద్భుతంగా నటించారన్న ఆయన.. టీజర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed