దాడి చేసినందుకు థాంక్స్ : వర్మ

by  |
దాడి చేసినందుకు థాంక్స్ : వర్మ
X

పవర్‌స్టార్ సినిమా చేస్తున్న రామ్‌గోపాల్ వర్మపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. ఒకవేళ వాళ్లు కామ్‌గా ఉన్నా సరే, వర్మ మాత్రం అలా ఉండనిచ్చేలా లేడు. రోజుకో వివాదం రాజుకునేలా ట్వీట్ చేస్తూ వారిని రెచ్చగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ‘ఎవరైనా ఎటాక్ చేస్తామని బెదిరిస్తారు కానీ చేయరు.. దమ్ముంటే నా ఆఫీస్ మీద దాడి చేయండి చూద్దాం.. గూగుల్ మ్యాప్స్‌లో ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది’ అని సవాల్ విసిరారు. దీంతో మండిపోయిన అభిమానులు.. నిజంగానే జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆర్జీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన వర్మ.. జనసేన కార్యకర్తలు అని చెప్పబడే పీకే అభిమానులు తన ఆఫీస్‌పై దాడి చేయడంతో జైల్లో పెట్టాల్సి వచ్చిందన్నారు. దాడి చేసినందుకు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పాడు వర్మ. ఈ విధంగా తన సినిమా పవర్‌స్టార్‌కు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్న పవన్ అభిమానులను చూస్తుంటే ముద్దు పెట్టుకుని, లవ్ చేయాలని అనిపిస్తోంది’ అన్నారు.

https://www.instagram.com/p/CC_ChohFk0I/?igshid=1x5zw8ajzlymo

Next Story

Most Viewed