- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డెలివరీ బాయ్‌కు పాజిటివ్.. 72 కుటుంబాలు క్వారంటైన్‌లోకి..!
<p>న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి ఎలా సోకుతుందో ఊహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా చాలా మందిని కలిసేవారిలో ఈ వైరస్ పాజిటివ్ సోకినట్టు ఇప్పుడు తెలిసినా.. ఎంతమందికి ఆ మహమ్మారి పాకిందో అన్న ఆందోళనలు వెల్లడవుతున్నాయి. ఇటువంటి రీతిలోనే ఢిల్లీలో ఓ కేసు నమోదైంది. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతను డెలివరీ చేసిన కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి. ఆ బాయ్ డ్యూటీలో ఉన్నప్పుడు డెలివరీ […]</p>

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి ఎలా సోకుతుందో ఊహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా చాలా మందిని కలిసేవారిలో ఈ వైరస్ పాజిటివ్ సోకినట్టు ఇప్పుడు తెలిసినా.. ఎంతమందికి ఆ మహమ్మారి పాకిందో అన్న ఆందోళనలు వెల్లడవుతున్నాయి. ఇటువంటి రీతిలోనే ఢిల్లీలో ఓ కేసు నమోదైంది. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతను డెలివరీ చేసిన కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి. ఆ బాయ్ డ్యూటీలో ఉన్నప్పుడు డెలివరీ చేసిన 72 కుటుంబాలను అధికారులు హోం క్వారంటైన్‌లోకి పంపారు. అంతేకాదు, కనీసం 20 మంది సహడెలివరీ ఏజెంట్‌లనూ నిర్బంధంలోకి తరలించారు. ఆ బాయ్‌కు కూడా అతను డెలివరీ చేసిన ఓ కుటుంబం నుంచి కరోనా సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సౌత్ ఢిల్లీలో 19 ఏళ్ల పిజ్జా డెలివరీ బాయ్.. ఏప్రిల్ 12వ తేదీ వరకు డ్యూటీ చేశాడు. అతనికి కరోనా పాజిటివ్ తేలడంతో.. ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.
Tags: coronavirus, delhi, delivery boy, quarantine, agent, pizza






