పిఠాపురం ఎమ్మెల్యేకు కరోనా..

17

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన కరోనా టెస్టులు నిర్వహించుకోగా ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ తేలిందని వైద్యులు ప్రకటించారు.

దీంతో కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో దొరబాబు చేరారు.కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.