బైరాన్‎పల్లి బురుజు వద్ద మహోత్తర కార్యక్రమం.. తరలిరండి.!

by  |
బైరాన్‎పల్లి బురుజు వద్ద మహోత్తర కార్యక్రమం.. తరలిరండి.!
X

దిశ, జనగామ : సాయుధ స్వాతంత్య్రయోధులైన 118 మంది అమరవీరుల ఆత్మ శాంతి కోసం వీర బైరాన్‎పల్లిలో సామూహిక పిండ ప్రధానం, పితృయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని మాజీ రాజ్య సభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. బుధవారం జనగామలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చరిత్రలో 1948 ఆగస్టు 27వ తేదిని మర్చిపోలేని రోజు అని అన్నారు. హైదరాబాద్ నిజాం కాలంలో.. ప్రజానికం మువ్వన్నెల జెండాను ఎగురవేసేందుకు విముక్తి, విమోచన, విలీన సాయుధ పోరాటాలు భారీ బలిదానాలకు దారితీశాయన్నారు. 13 నెలల వీరోచిత విప్లవంలో వీర బైరాన్‎పల్లిది మహావీరగాధ అని అన్నారు. అందుకే బైరాన్‎పల్లి ఖ్యాతి గడించిందని, తెలంగాణలో కనిపించే గడీలు, బురుజులు, దొరతనం దౌష్ట్యానికి నిదర్శనమని తెలుపుతూ ఈనెల 27వ తేదిన సాయుధ అమరులకు గుర్తింపుగా వీర బైరన్‎పల్లి రక్తపుమడుగు బురుజు వద్ద 118 మంది వీరులకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సామూహిక పిండ ప్రధానం, పితృయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed