చిరిగిన డ్రెస్‌లో సమంత.. పిన్నీసులతో కవరింగ్.. అసలు ఏమైంది?

2217
Samantha

దిశ, సినిమా : టాలీవుడ్‌ మోస్ట్‌ రొమాటింక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ‘సమంత-నాగ చైతన్య’ తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయినప్పటికీ.. ఇద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం ప్రచారంలో ఉంటోంది.

ఇదిలా ఉంటే, చిరిగిన డ్రెస్‌కు పిన్నీసులు పెట్టుకున్న సామ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్టార్ హీరోయిన్ సమంత చిరిగిన డ్రెస్ ఎందుకు వేసుకుంటుంది? పైగా పిన్నీస్ కూడా పెట్టుకోవాల్సిన కర్మ ఏంటి? అని ఆశ్చర్యపోకండి. విషయం ఏంటంటే.. హాలీవుడ్‌ ఫ్యాషన్‌ షోస్‌‌లో ఎక్కువగా కనిపించే ‘టోర్న్‌ డ్రెస్’ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలోనూ అక్కడక్కడ కనిపిస్తోంది. డ్రెస్‌లు చిరిగిపోయిన చోట పిన్నీసులతో కవర్ చేయడమే వీటి ప్రత్యేకత. కాగా ట్రెండ్‌కు తగ్గట్టుగా డ్రెసింగ్ స్టైల్‌ ఫాలో అయ్యే సమంత.. ‘సాకి’ బ్రాండ్‌ నేమ్‌తో ఫ్యాషన్‌వేర్ బిజినెస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో కనిపించే ఈ ‘ఫ్యాషన్ లేడీ’ తాజాగా ఓ యాడ్ షూట్‌ కోసం ధరించిన ‘టోర్న్‌ డ్రెస్‌’లో ఇలా పిన్నీసులతో కనిపించింది.

షాకింగ్: థియేటర్లో అఖండ మూవీ చూసిన అఘోరాలు….

చివరికి అలా చేస్తూ బయటకి వెళ్లిపోయిన అఘోరాలు.. ఎక్కడంటే..?

samantha