టీకాపై కీలక ప్రకటన.. ఆ వయసు వారికి సురక్షితమేనట..

by  |
టీకాపై కీలక ప్రకటన.. ఆ వయసు వారికి సురక్షితమేనట..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు వ్యాక్సిన్ల పనితీరుపై కొన్ని దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. తాజాగా అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన టీకా పన్నెండేళ్లు దాటిన పిల్లలకు కూడా సురక్షితమని ఓ ప్రకటనలో తెలిపింది.

12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2,260 మందిపై పరీక్షలు జరిపామని, వీరిలో పూర్తిస్థాయిలో టీకా తీసుకున్న వారిలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపింది. టీకా ప్రభావంపై పూర్తి అధ్యయనం కోసం టీకాలు తీసుకున్న వారి ఆరోగ్యాన్ని రెండేళ్ల పాటు గమనిస్తామని చెప్పింది. టీకా పొందిన వారిలో పెద్దలకు వచ్చినట్లుగానే వీరిలో కూడా జ్వరం, చలి మొదలైనవి వస్తున్నాయని పేర్కొంది.

ఈ టీకాను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందకు తాము కృషి చేస్తున్నట్టు సంస్థ అధికారులు తెలిపారు. ప్రభుత్వం దీనికి అత్యవసర అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఫైజర్​టీకాను 16 ఏళ్లు పైబడిన వారికే పంపిణీ చేస్తున్నారు.


Next Story

Most Viewed