వ్యక్తిపై గొడ్డలితో దాడి.. పాత కక్షలే కారణం!

81

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం ఖతగాం గ్రామంలో చందుపై శంకర్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో చందుకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో చందును చికిత్స నిమిత్తం నిజామాబాద్ అసుపత్రికి తరలించారు. కాగా పాత కక్షలను మనస్సులో పెట్టుకుని చందుపై శంకర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శంకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..