- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర సీఎంపై బ్యాడ్ కామెంట్స్..వ్యక్తి అరెస్టు
<p>దిశ, క్రైమ్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిని రాచకొండ సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలపై అమర్యాదకరంగా, అభ్యంతకరమైన పోస్టులను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అది గమనించిన కొందరు సీఎం అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయంపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితున్ని […]</p>

దిశ, క్రైమ్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిని రాచకొండ సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలపై అమర్యాదకరంగా, అభ్యంతకరమైన పోస్టులను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అది గమనించిన కొందరు సీఎం అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయంపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకివెళితే..యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చిన్నం బాలచందర్(24) ఉప్పల్ మైసమ్మ దేవాలయం వద్ద నివసిస్తూ స్థానిక బజాజ్ షోరూమ్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతినేలా యత్నించినందుకు క్రైమ్ నెంబర్ 234/2020 ఐపీసీ 501, 504, 505, ఐటీ చట్టం సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించినట్టు ఇన్ స్పెక్టర్ రాము తెలిపారు. రాచకొండ క్రైమ్ డీసీపీ పి.యాదగిరి, ఏసీపీ హరినాథ్ పర్యవేక్షణలో కేసు విచారణ జరిపినట్టు ఇన్ స్పెక్టర్ రాము వెల్లడించారు.






