సిల్లీ రీజన్స్‌‌తో సెక్యూరిటీ డిపాజిట్ గోవింద!

by  |
సిల్లీ రీజన్స్‌‌తో సెక్యూరిటీ డిపాజిట్ గోవింద!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ఏ గల్లీలో చూసినా.. ‘టులెట్’ బోర్డులే వేలాడుతున్నాయి. అదంతా కరోనా ఎఫెక్ట్ కాగా, ఈ పరిస్థితి జస్ట్ కొన్నిరోజులు మాత్రమే. ఈ సంగతి పక్కనబెడితే అసలు మహా నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడమంటేనే ఓ పెద్ద పజిల్ లాంటిది. ఒకవేళ సులభంగానే దొరికినా, ఇంటి యజమాని పెట్టే కండిషన్స్ తలచుకుంటే.. ఇవేం రూల్స్ రా బాబూ! అని మనసులో అనుకోకుండా ఉండలేం. అయితే, మనకేమో తప్పకుండా ఇల్లు అద్దెకు కావాలి, అది కూడా జాబ్ లొకేషన్‌కు దగ్గరగా ఉండాలి. ఇవన్నీ బేరీజు వేసుకుంటే.. ఎన్ని కండిషన్స్ పెట్టినా తీసుకోవాల్సిందే. ఇక అద్దెకు దిగేముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మనీని ల్యాండ్‌లార్డ్‌కు ఇవ్వక తప్పదు. కాగా, చిన్న చిన్న కారణాలతో యజమానులు ఆ డబ్బును తిరిగివ్వడం లేదని కిరాయిదారులు అంటున్నారు. ట్విట్టర్‌లో తమ ఆవేదనను వెల్లబోసుకుంటున్నారు. ఓ సారి ఆ సిల్లీ రీజన్స్ చూస్తే.. మీరు అవాక్కవుతారు.

సిటీల్లో ‘టులెట్ బోర్డు’ల విషయానికొస్తే.. ఓ చోట ‘బ్యాచిలర్స్‌కు మాత్రమే’ అని రాసుంటే.. మరికొన్ని చోట్ల ‘ఫర్ ఫ్యామిలీ, వెజిటేరియన్స్ ఓన్లీ లేదా ఉద్యోగులకే ఇవ్వబడును’ అంటూ రకరకాలుగా దర్శనిమిస్తాయి. ఆ బోర్డు చూసి, ఓనర్లను కాంటాక్ట్ అవ్వగానే.. మీరేం పని చేస్తారు? ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు? ఇంటికి ఎన్ని గంటలకు వస్తారు? టూ వీలర్ ఉందా లేదా కారు ఉందా? లైట్లు ఎన్ని గంటలకు ఆర్పుతారు? మందు తాగుతారా? పార్టీలు చేసుకునే అలవాటు ఉందా? ఇంటికి స్నేహితులు, చుట్టాలు వస్తారా? అసలు మీ క్యాస్ట్ ఏంటి? ఇలా సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత.. వాళ్ల కండిషన్స్ కూడా చెబుతారు. రాత్రి పది దాటితే గేటుకు తాళం వేస్తాం. నీళ్లు ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. కరెంట్ ఎక్కువగా కాల్చొద్దు. చుట్టాలు, స్నేహితులు ఇంటికి ఎక్కువగా రావొద్దు. సమ్మర్‌లో అయితే, అసలే రావొద్దు. గోడలకు మేకులు కొట్టొద్దు.. ఇలా బోలెడు ఉంటాయి. టూ మంత్స్ రెంట్ ముందే ఇవ్వాలి. బోర్ బిల్, నల్లా బిల్, మెయింటెనెన్స్ సెపరేట్‌గా ఇవ్వాలి. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇవన్నింటికీ ఒప్పుకున్నాకే అద్దెంట్లిలోకి దిగేది. ఇదంతా ఓ టాస్క్ అయితే, వెళ్లేటప్పుడు మరో టాస్క్. కాగా, ఇంటి యజమానులు సిల్లీ రీజన్స్‌ చెప్పి, సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. మరికొంత మంది.. సెక్యూరిటీ డిపాజిట్ నుంచి కొంత మొత్తం కట్ చేసుకుని.. మిగతావి తిరిగిచ్చేస్తున్నారు.

ఇక ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ హడావిడిలో.. కొన్ని వస్తువులను అక్కడే మర్చిపోతాం. ఆ మాత్రం దానికే సెక్యూరిటీ డిపాజిట్ ఉంచేసుకుంటున్నారు. , కిచెన్ వాల్‌లో నూనె మరకలు ఉన్నాయని, ఫ్లోర్‌పైన గీతలు పడ్డాయని, కిటికీల నట్లు ఊడిపోయాయని, స్విచ్ బోర్డు సాకెట్లు పాడు చేశారని, బాత్‌రూమ్ సరిగా క్లీన్ చేయలేదని, కారిడార్‌లో మొక్కలు అలా వదిలి వెళ్లిపోయారని.. ఇలా చాలా చిన్న చిన్న కారణాలతో సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వడం లేదంటూ ట్విట్లర్‌లో తమ బాధను చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఓనర్లు కూడా ఉంటారా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొన్ని రీజన్లు చూస్తే నవ్వకుండా ఉండలేరు.. సోఫా కింద సాక్స్ వదిలివెళ్లిపోయారని, కప్‌బోర్డులో హ్యాంగర్స్ అలానే ఉంచేశారని, కిటికీలకు దుమ్ము పట్టిందని, కర్టెన్స్ స్మెల్ వస్తున్నాయని కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఇందులో ఏదో ఒక అనుభవం మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది.


Next Story