- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయం గుప్పిట్లో ఆ గ్రామాలు.. వరుస దొంగతనాలతో సామాన్య ప్రజలు హడల్
<p>దిశ, నిజామాబాద్ రూరల్: రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండల గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ నిఘా పెంచాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని రెండు ఇళ్లలోచోరీ అదేవిధంగా రామడుగు గ్రామంలో నాయుడి మురళి ఇంట్లో 6 తులాల బంగారాన్ని దొంగలు దోచుకుని వెళ్లారు. దీంతో ఒక్కసారిగా దర్పల్లి మండల ప్రజలు ఉలిక్కి పడ్డారు. రాత్రి వేళల్లో దొంగతనాలు జరగటంతో మండలంతో […]</p>

దిశ, నిజామాబాద్ రూరల్: రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండల గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ నిఘా పెంచాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని రెండు ఇళ్లలోచోరీ అదేవిధంగా రామడుగు గ్రామంలో నాయుడి మురళి ఇంట్లో 6 తులాల బంగారాన్ని దొంగలు దోచుకుని వెళ్లారు. దీంతో ఒక్కసారిగా దర్పల్లి మండల ప్రజలు ఉలిక్కి పడ్డారు. రాత్రి వేళల్లో దొంగతనాలు జరగటంతో మండలంతో పాటు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మండల ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ప్రస్తుతం శుభకార్యాల వేళ ఇంటికి తాళం వేసి వెళ్ళాలంటే, దొంగల భయంతో శుభకార్యాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.
పోలీస్ పెట్రోలింగ్ రాత్రివేళల్లో లేకపోవడంతో రూరల్ నియోజకవర్గంలో ఉన్న మోపాల్, ఇందల్వాయ్, సిరికొండ, డిచ్పల్లి, రూరల్, జక్రాన్పల్లి మండలం చెందిన గ్రామీణ ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. దర్పల్లి మండలంలోని రెండు గ్రామాల్లో జరిగిన దొంగతనాలకు కారణమైన వ్యక్తులను పోలీసులు ఇప్పటివరకు పట్టుకోకపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని గ్రామాల ప్రజలు పోలీసులకు విన్నవించుకుంటున్నారు. పోలీస్ కళాజాత నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మూఢనమ్మకాలపై, గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, అదేవిధంగా డయల్ 100 సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సైతం ప్రజలకు పేర్కొంటున్నారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభ్యుదయ కమిటీ సభ్యులు సమన్వయంతో గ్రామాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు ఇదివరకే రూరల్ మండలంలోని ఉన్న గ్రామ పంచాయతీ పాలకవర్గ సిబ్బందికి గ్రామ కమిటీ సభ్యులకు పేర్కొనడం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా పోలీస్ బాస్ కార్తికేయ సూచనల మేరకు హత్య కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు దొంగతనాల కేసులు సీసీ పుటేజీల ద్వారా సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దర్పల్లి మండలంలో దుబ్బాక, రామడుగు గ్రామాల్లో జరిగిన చోరీలకు సంబంధించిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.






