ఓ వింత జీవిని చూసి భయపడిన జనాలు.. కానీ..?

by  |
ఓ వింత జీవిని చూసి భయపడిన జనాలు.. కానీ..?
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ప్రపంచంలో ప్రతినిత్యం ఎక్కడో ఓ చోటు వింత సంఘటనలు, వింత జీవులు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పోలాండ్ లోని క్రాకో అనే నగరంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ అపార్టుమెంటు పక్కన గల చెట్టుపై తల, కాళ్ళు లేకుండా ఓ వింత జీవి కనిపించింది. దాన్ని చూసి భయపడిన స్థానికులు అది ఇంట్లోకి వస్తుందేమోనని కిటికీలు వేసుకొని కూర్చున్నారు. ఓ ఆవిడా మాత్రం పోలీసులకు ఫోన్ చేసి.. మా ఇంటి దగ్గరలో ఉన్న చెట్టుపై ఓ వింత జీవి ఉందని దాన్ని చూసి మేమంతా భయాందోళనకు గురవుతున్నామని చెప్పింది.

ఆమె సమాచారంతో అక్కడికి చేరుకున్న క్రాకో యానిమల్ వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది దాన్ని నిశితంగా పరీక్షించి ఆజీవి గుట్టు రాబట్టారు. ఇంతకీ అది ఏ జీవి.. దాని పేరు ఏంటని అనుకుంటున్నారా.. అది జీవికాదు..వింత జంతువూ కాదు.. ఆ దేశంలో లభించే క్రొసియెంట్ (croissant) అనే ఒక రకమైన బ్రెడ్. స్థానికులు ఎవరో దాన్ని పక్షులకు ఆహారం అందివ్వడానికి చెట్టుపై పెట్టిఉంటారని వాళ్ళు తెలిపారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకొని నవ్వుకున్నారు. ఈ హాస్యాస్పద ఘటనకు సంభందించిన ఫోటోను క్రాకో యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఈ పిక్ పై నెటిజెన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూ, షేర్ చేస్తున్నారు.

Next Story

Most Viewed