NTR సరసన యంగ్ బ్యూటీ.. మురిసిపోతున్న ఫ్యాన్స్

by  |
jr NTR, sree leela
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తొలిసారి నటించిన చిత్రం ‘పెళ్లి సందD’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల, ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ‘పెళ్లి సందD’ మూవీలో తన నటన, అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ కొట్టేసిందని ఫిల్మ్ నగర్ టాక్. ‘RRR’ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. దీంతో శ్రీలీలకు ఈ మూవీ టర్నింగ్ పాయింట్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది యంగ్ బ్యూటీ.

Next Story

Most Viewed