ఇంకా ఎడ్లబండిలోనే పాఠశాలకు @పెద్దగుడిపేట

by  |
ఇంకా ఎడ్లబండిలోనే పాఠశాలకు @పెద్దగుడిపేట
X

దిశ, బెల్లంపల్లి: దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు. పాలకులు, యంత్రాంగం నిర్లక్ష్యంతో కొన్ని పల్లెల్లు అభివృద్దికి ఆమడదూరంలో నిలుస్తున్నాయి. మౌలిక సదుపాయాలు పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది. బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండల పరిధిలోని బిట్టురుపల్లి పంచాయతీలోని పెద్దగుడిపేట గ్రామం సమస్యల వలయంలో చిక్కుకుంది. గ్రామానికి సరైన రోడ్డు, వైద్య సదుపాయాలు లేక పోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే నాలుగునెలల పాటు వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్న పరిస్థితి నెలకొంటున్నది.

కరెంట్ ఉండదు..

పెద్దగుడిపేట గ్రామంలో సుమారు 250 వరకు జనాభా ఉన్నారు. గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సదుపాయాన్నినేటికి ఒక కల. పాలకులు, యంత్రాంగం దృష్టిసారించకపోవడం గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వానాకాలం వచ్చిందంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు ఊరిలోకి రావడానికి కనీసం వాహన సదుపాయం ఉండదు. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో గ్రామానికి వచ్చేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. రోజులో కనీసం 10 నుంచి 12 గంటల కరెంటు కూడా ఉండదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5 కి.మీ దూరంలో ఉన్నా..

మండల కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే అధికార యంత్రాంగం ఎవరూ పట్టించుకోవడం లేదు. నేటికీ ఎవరూ సందర్శించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పల్లె ప్రగతి కార్యక్రమాలు అనేకం ఉన్నప్పటికీ గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయం. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అభివృద్ధి పడకేసింది.

ఎడ్లబండ్లలో స్కూల్‌కు

నాలుగు నెలల క్రితం ఊరిలో ఉన్న మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా మార్చుకునేందుకు గ్రామస్థులు ఏకం అయ్యారు. వారే స్వయంగా రూ.4 లక్షల పోగు చేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. గ్రామంలో సరైన వైద్యం అందుబాటులో ఉండదు. మండల కేంద్రానికి వెళ్తే తప్ప వారికి చదువు, వైద్యం అందని పరిస్థితి నెలకొంది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో స్కూలు బస్సులు ఏవీ గ్రామానికి రావడం లేదు. దీంతో స్కూల్ పిల్లలను వారి తల్లిదండ్రులే ఎడ్లబండి కట్టుకుని తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది.

Next Story

Most Viewed