భారత్‌కు వరుసగా రెండో ఓటమి

by Harish |
భారత్‌కు వరుసగా రెండో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా యూరోప్ పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 2-0తో పరాజయం పాలైంది. అయితే, మొదటి నుంచి ఇరు జట్లు చక్కటి డిఫెన్స్ ప్రదర్శించడంతో ఫస్టాఫ్‌లో ఏ జట్టూకు గోల్ చేయలేకపోయింది. సెకండాఫ్‌లో బెల్జియం పుంజుకుంది. స్వల్ప వ్యవధిలోనే రెండు గోల్స్ చేసింది. అలెక్సియా 34వ నిమిషంలో, దేవాట్ లూయిస్ 36వ నిమిషంలో గోల్స్ చేయడంతో బెల్జియం 2-0తో పట్టు సాధించింది. మరోవైపు, భారత ప్లేయర్లు ఒక్క గోల్ కూడా చేయలేక మ్యాచ్‌ను సమర్పించుకున్నారు. బుధవారం అర్జెంటీనా చేతిలో 5-0తో ఓడిపోయిన విషయం తెలిసిందే. శనివారం బెల్జియంతో భారత్ మరోసారి తలపడనుంది.

Next Story

Most Viewed